జువెలరీ అరేబియా 2024ను ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!

- November 27, 2024 , by Maagulf
జువెలరీ అరేబియా 2024ను ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!

మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సఖిర్‌లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో జ్యువెలరీ అరేబియా, సెంట్ అరేబియా 2024 ఎగ్జిబిషన్‌లను ప్రారంభించారు. బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030కి అనుగుణంగా ఆర్థిక వైవిధ్యీకరణ కార్యక్రమాలకు మద్దతునిస్తూనే ప్రాంతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు బహ్రెయిన్‌ను ప్రపంచ కేంద్రంగా నిలిపాయని రాయల్ హైనెస్ పేర్కొన్నారు. కింగ్డమ్ పెట్టుబడి వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.  అనంతరం హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.  జువెలరీ అరేబియా, సెంట్ అరేబియా 2024 ఎగ్జిబిషన్‌లలో 27 దేశాల నుండి 700 మంది జ్యూయలరీ ఎగ్జిబిటర్‌లు ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనలో విలువైన బంగారు ఆభరణాలు, రత్నాలు,  ప్రముఖ బ్రాండ్‌ల పెర్ఫ్యూమ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com