బహ్రెయిన్ లోని ఎంబసీలను ముంచెత్తుతున్న క్షమాభిక్ష వ్యవధి కేసులు
- July 08, 2015
ఆరునెలల సాధారణ క్షమాభిక్ష ప్రకటనకు స్పందనగా జులై 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉండే ఈ క్షమాభిక్ష కాలవ్యవధిలో తమ స్వదేశాలకు ఏ విధమైన జరిమా నా చెల్లించనవసరం లేకుండానే తరలిపోవడానికి వస్తున్న వందలాది ట్రావెల్ డాక్యుమెంట్ల నిర్వహణకై బహ్రెయిన్ లోని విదేశీ ఎంబసీలు రాత్రి షిఫ్ట్ లలో కూడా పనిచేసేందుకు అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు.
లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ వారి లెక్కల ప్రకారం, సుమారు 61,000 మంది అక్రమ వలస కార్మికులున్నారని, వారిలో 50 శాతం వరకు బంగ్లాదేశీయులనీ తెలిపారు. రోజూ ఇచుమించు 100 మంది వరకు బహ్రెయిన్ లో చట్టబద్ధంగా జీవించడానికి లేదా దేశం వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని, వారి దరఖాస్తులను స్వీకరించడానికి ఔట్ సోర్సింగ్ రెజిస్ట్రేషన్ కౌంటర్లను తెరిచి, ఛార్జీలుగా 2 బహ్రైని దీనార్లు వసూలుచేయనున్నామని బంగ్లాదేశ్ ఎంబసీ లేబర్ కౌన్సిలర్ మొహమ్మద్ ఇస్లాం తెలిపారు.
ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా, వారు బ్లాక్ లిస్టు లోకి వెళ్లారనీ, అంతేకాకుండా గత యజమాని అనుమతి లేకుండానే కొత్త యజమాని వద్ద చేరవచ్చుననీ తెలిపారు. ఐతే కోర్టుకేసులో ఉన్నవారికీ, బకాయిలు ఉండడం వలన ప్రయాణం నిషేధం ఉన్నవారికీ ఇది వర్తించ దని తెలిపారు. ఇదివరకు 2010లో ఈవిధమైన అవకాశా న్ని కలిగించినప్పుడు సుమారు 6000 మంది దేశాన్ని విడిచి వెళ్లారని ఆయన తెలిపారు. అధిక వివరాలకు లేబర్ మార్కెట్ రేగ్యులేటరీ అథారిటీ వారి కాల్ సెంటర్ నంబర్ 17506055 వద్ద సంప్రదించవచ్చునని తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







