రియాద్ లో మెట్రో స్టేషన్ ప్రారంభించిన సౌదీ అరేబియా కింగ్
- November 27, 2024
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో నిర్మించబడిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ రియాద్ మెట్రో స్టేషన్. 22.5 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ మెట్రో స్టేషన్ ను సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ముఖ్య అతిథిగా పాల్గొనీ 2024 నవంబర్ 27 న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తో పాటు రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్, మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలు పాటు నిర్మాణం కొనసాగి ప్రారంభమైన ఈ మెట్రో స్టేషన్ రియాద్ నగరాన్ని ఆధునికీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు
ఈ మెట్రో స్టేషన్ ప్రయాణికులకు అనేక సదుపాయాలను అందిస్తుంది. ఇందులో ఆధునిక సౌకర్యాలు, సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. ప్రయాణికులు సులభంగా ప్రయాణించడానికి వివిధ రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. రియాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా, నగర ట్రాఫిక్ ను తగ్గించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మెట్రో స్టేషన్ ద్వారా రోజుకు సుమారు 1.2 మిలియన్ మంది ప్రయాణికులు ప్రయాణించగలరు.
ఈ మెట్రో స్టేషన్ లో మూడు ప్రధాన లైన్లు ఉన్నాయి: బ్లూ లైన్, రెడ్ లైన్, మరియు యెల్లో లైన్. ఈ లైన్లు రియాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతాయి.
బ్లూ లైన్ (లైన్ 1): ఈ లైన్ 38 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇది అల్ ఒలయా నుండి బాతా వరకు విస్తరించి ఉంటుంది. ఈ లైన్ లో 22 స్టేషన్లు ఉన్నాయి.
రెడ్ లైన్ (లైన్ 2): ఈ లైన్ 25.3 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇది కింగ్ సౌద్ యూనివర్సిటీ నుండి కింగ్ ఫహద్ స్టేడియం వరకు విస్తరించి ఉంటుంది. ఈ లైన్ లో 15 స్టేషన్లు ఉన్నాయి.
ఆరెంజ్ లైన్ (లైన్ 3): ఈ లైన్ 40.7 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇది జెడ్డా రోడ్ నుండి ఖస్మ్ అల్ ఆన్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ లైన్ లో 22 స్టేషన్లు ఉన్నాయి.
ఈ మూడు లైన్లు రియాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఈ మెట్రో స్టేషన్ నిర్మాణం సౌదీ అరేబియాలోని రియాద్ నగరాన్ని మరింత ఆధునికంగా మార్చడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రాజెక్ట్ సౌదీ అరేబియాలోని ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







