తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్
- November 29, 2024
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ నిర్వహిస్తుంది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్‌ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తుంది. జిల్లాల ఇన్‌చార్జిల నేతృత్వంలో ర్యాలీలతో పాటు అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొంటున్నారు.
కేటీఆర్ ఉపన్యాసంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. “నేడు దీక్షా దివస్.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన కేసీఆర్ దీక్ష.. తెలంగాణకు అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. జై కేసీఆర్.. జై తెలంగాణ” అని బీఆర్ఎస్ పార్టీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







