స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం: TTD

- November 30, 2024 , by Maagulf
స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం: TTD

తిరుమల: డిసెంబర్ 1న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం లో , తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ.

టిటిడి ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.అందులో భాగంగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును టిటిడి జారీ చేయనుంది.

తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి , రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టిటిడి తెలియజేయడమైనది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com