పన్ను చెల్లించడానికీ సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ: మోదీ
- June 26, 2016
పన్ను చెల్లించకుండా దాచిన డబ్బు, ఆదాయ వివరాలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలని, ఇందుకు సెప్టెంబరు 30 ఆఖరు తేదీ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పన్ను ఎగవేతదారులకు ఇదే ఆఖరి అవకాశమని, వివరాలు తెలియజేయకుంటే చర్యలు తప్పవని మోదీ హెచ్చరించారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం స్వచ్ఛ భారత్ కు విరాళాలు ఇస్తున్నారని, అలాంటిది పన్నులు ఎగవేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.ప్రజాస్వామ్యమే మన బలమని, ఇది ప్రతి పౌరుణ్ని శక్తిమంతుణ్ని చేస్తుందని మోదీ అన్నారు. దేశాభివృద్ధి కోసం మన శాస్త్రవేత్తలు, రైతులు నిరంతరం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిన అవసరముందని సూచించారు. యోగా డే సందర్భంగా దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది పాల్గొన్నారని మోదీ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







