యూఏఈ జాతీయ దినోత్సవం: షార్జా, దుబాయ్‌లో ఉచిత పార్కింగ్..!!

- December 01, 2024 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవం: షార్జా, దుబాయ్‌లో ఉచిత పార్కింగ్..!!

యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా షార్జా రెండు రోజుల ఉచిత పార్కింగ్‌ను ప్రకటించింది. ఎమిరేట్‌లోని పబ్లిక్ పార్కింగ్ కు డిసెంబర్ 2, 3 తేదీలలో రుసుము నుండి మినహాయింపు ప్రకటించారు. తిరిగి చెల్లింపు పార్కింగ్ డిసెంబర్ 4 నుండి పునఃప్రారంభం అవుతుంది.  అయితే, షార్జాలోని పెయిడ్ పార్కింగ్ జోన్‌లలో ప్రభుత్వ సెలవు దినాలతో సహా వారంలోని ప్రతి రోజు రుసుములకు సంబంధించిన ఛార్జీలు యథావిధిగా వర్తిస్తాయని పేర్కొన్నారు.

అదేవిధంగా  దుబాయ్ రాబోయే ప్రభుత్వ సెలవు దినాలలో ఉచిత పార్కింగ్‌ను కూడా ప్రకటించింది. డిసెంబర్ 2,  3 తేదీలలో అన్ని పబ్లిక్ పార్కింగ్ ఉచితంగా (మల్టీ లెవెల్ పార్కింగ్ మినహా) ఉంటుందని ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. ఆదివారాల్లో ఎటువంటి రుసుము వసూలు చేయబడనందున ఇది మూడు రోజుల ఉచిత పార్కింగ్ అందుబాటులో ఉండనుంది.

ఈ సంవత్సరం ఈద్ అల్ ఎతిహాద్ కోసం నాలుగు రోజుల వారాంతాన్ని పొందారు. ప్రభుత్వ అధికారులు డిసెంబర్ 2, 3 తేదీలను ప్రైవేట్ ప్రభుత్వ రంగాలకు చెల్లింపు సెలవులుగా ప్రకటించారు. దుబాయ్‌లోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు, నర్సరీలు, విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 4 నుండి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి.

యూఏఈ 1971లో ఎమిరేట్స్ ఏకీకరణను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న ఈద్ అల్ ఎతిహాద్ అని పిలవబడే జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం 53 ఏళ్లు పూర్తవుతుంది. అధికారిక ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలు అల్ ఐన్ లో జరుగుతున్నాయి. ఇందులో దేశ పాలకులు, నాయకులు హాజరుకానున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com