401.8 మిలియన్ దిర్హామ్‌ల రుణాలు రద్దు చేసిన యూఏఈ..!!
- December 01, 2024
యూఏఈ: యూఏఈలో 1277 మంది పౌరుల అప్పులను యూఏఈ రద్దుచేసింది. వీటి విలువ Dh401,791,531. యూఏఈ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫాలో-అప్‌తో, ఎమిరాటీ పౌరుల రుణాలను రద్దుచేశారు. దేశంలోని 18 బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల సహకారంతో నేషనల్స్ డిఫాల్టెడ్ డెట్ సెటిల్‌మెంట్ ఫండ్ (NDDSF) ఈ మినహాయింపును ప్రకటించింది. తక్కువ-ఆదాయ వ్యక్తులు, పదవీ విరమణ పొందినవారు, సీనియర్ సిటిజన్‌లతో సహా వివిధ లబ్ధిదారులకు రుణాల నుండి మినహాయింపు ప్రకటించారు. జాబితాలో 19 బ్యాంకులు, సంస్థలు ఉన్నాయి. అబుదాబి కమర్షియల్ బ్యాంక్ (ADCB) గ్రూప్, అల్ హిలాల్ బ్యాంక్, ఎమిరేట్స్ NBD, మష్రెక్ బ్యాంక్, ఫస్ట్ అబుదాబి బ్యాంక్ (FAB), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB), షార్జా ఇస్లామిక్ బ్యాంక్, దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, ఎటిసలాట్, అరబ్ బ్యాంక్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫారిన్ ట్రేడ్, ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్, యునైటెడ్ అరబ్ బ్యాంక్, HSBC, RAK బ్యాంక్, ఆమ్లాక్ ఫైనాన్స్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉమ్ అల్ క్వైన్, సిటీ బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల నుండి పొందిన రుణాలను అధికారులు జాతీయ నిధి నుంచి సర్దుబాటు చేయనున్నారు. రుణాల రద్దు నిర్ణయంపై NDDSF సుప్రీం కమిటీ చైర్మన్ జబర్ మహమ్మద్ ఘనేమ్ అల్ సువైదీ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







