ఆండ్రాయిడ్ వినియోగదారులూ అప్రమత్తంగా ఉండండి..
- June 26, 2016
ఆండ్రాయిడ్ వినియోగదారులూ అప్రమత్తంగా ఉండండి. ఫోన్‌లోకి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఏది పడితే అది డౌన్‌లోడ్ చేసుకుంటే.. మీరు ప్రమాదంలో పడ్డట్లేనని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 'గాడ్‌లెస్' అనే ప్రమాదకరమైన మాల్‌వేర్ పడగవిప్పి కూర్చుందట. దాని ప్రభావం ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే అధికంగా ఉందని జపాన్ చెందిన ప్రముఖ సెక్యూరిటీ పరిశోధన సంస్థ 'ట్రెండ్ మైక్రో' పరిశోధకులు గుర్తించారు.అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్‌వేర్ దాదాపు 90శాతం ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడే ప్రమాదముందని ట్రెండ్ మైక్రో చెబుతోంది. ఈ మాల్‌వేర్ ఉన్న ఏదైనా అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫోన్ పూర్తిగా ప్రమాదంలో పడ్డట్లేనట. ఈ 'గాడ్‌లెస్' మాల్‌వేర్ ఫోన్‌లోకి వెళ్లిన తర్వాత వినియోగదారుడి ప్రమేయం లేకుండానే ప్రమాదకరమైన అప్లికేషన్లను దానంతట అదే డౌన్‌లోడ్ చేసేస్తుందట. దీంతో ఫోన్ పూర్తిగా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 8.50లక్షల ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ వైరస్ బారిన పడ్డట్లు సంస్థ అంచనా వేస్తోంది.
ఆండ్రాయిడ్ 5.1(లాలీపాప్).. అంతకుముందు వెర్షన్ ఓఎస్‌తో రన్ అవుతున్న ఫోన్లపై ఈ మాల్‌వేర్ దాడి చేస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీని ప్రభావం భారత్‌లోనే అధికంగా 46.19శాతం ఉందట. ఆ తర్వాత ఇండోనేషియా 10.27శాతం.. థాయ్‌లాండ్ 9.47శాతం ఉందని ట్రెండ్ మైక్రో వెల్లడించింది.
నిపుణుల సలహాలు * గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా ప్రైవేటు వెబ్‌సైట్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు * ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్‌లోనే అప్‌డేట్ చేసుకోవాలి * నమ్మకమున్న డెవలపర్ల యాప్‌లనే డౌన్‌లోడ్ చేసుకోవాలి * డౌన్‌లోడ్ చేసుకునే ముందు ప్లేస్టోర్‌లో రివ్యూలను పరిశీలించండి * ఏదైనా మంచి మొబైల్ యాంటీవైరస్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా వాడండి * అవకాశముంటే ఆండ్రాయిడ్ 6.0(మార్ష్‌మాల్లో)కి అప్‌డేడ్ చేసుకోండి
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







