నాసిరకం బంగారు ఉత్పత్తులపై MoCI కఠిన చర్యలు ప్రారంభం..!!
- December 02, 2024దోహా: నాసిరకం బంగారం ఉత్పత్తులపై ఇటీవల వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్‌లపై తనిఖీలను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో నాణ్యత పరీక్ష కోసం బంగారు రిటైలర్ల నుండి నమూనాలను సేకరింరించారు. కమర్షియల్ ఫ్రాడ్, నకిలీల విభాగం అధిపతి అబ్దుల్లా అలీ సల్మీ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తుల నాణ్యత ఉండడం లేదని, తమ విభాగానికి నిర్దిష్ట ఫిర్యాదులు అందిన తర్వాత ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
బంగారు సంస్థలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని, పరీక్ష కోసం వివిధ బులియన్ నమూనాలను సేకరించామని ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అల్-షామ్రీ చెప్పారు. రిటైలర్‌లకు మంత్రిత్వ శాఖ కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రమైన జరిమానాలు ఉంటాయి. ఉల్లంఘించిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 3,000 నుండి 1,000,000 రియాల్స్ వరకు జరిమానా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!