యూఏఈలో బోల్ట్ ఇ-హెయిలింగ్ యాప్ లాంచ్.. 7 రైడ్లపై 53% తగ్గింపు..!!
- December 02, 2024
దుబాయ్: యూఏఈలో ఇ-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ బోల్ట్ ప్రారంభమైంది. దుబాయ్ నివాసితులు, పర్యాటకులు తొలి ఏడు రైడ్లపై 53 శాతం తగ్గింపును పొందవచ్చు. దేశం ఈద్ అల్ ఎతిహాద్ (యూఏఈ జాతీయ దినోత్సవం) సందర్భంగా ఈ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడింది. దాని వ్యవస్థాపక 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ తగ్గింపు ప్రకటించారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే వారు డిసెంబర్ 15 వరకు తగ్గింపును పొందవచ్చు. ఒక్కో రైడ్‌కు గరిష్టంగా 35 దిర్హామ్‌ల తగ్గింపును బోల్ట్ తెలిపింది. అంతర్జాతీయ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ బోల్ట్.. ఇది ఈజిప్ట్, సౌదీ అరేబియాతో సహా 50 దేశాలలో 600 నగరాల్లో సేవలను అందిస్తుంది. రాబోయే కొన్నేళ్లలో 80 శాతం టాక్సీ ట్రిప్పులను ఈ-హెయిలింగ్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకోవాలని దుబాయ్ ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..