అజ్మాన్ లో అనేక వాహనాలు సీజ్.. భారీగా జరిమానాలు విధింపు..!!

- December 03, 2024 , by Maagulf
అజ్మాన్ లో అనేక వాహనాలు సీజ్.. భారీగా జరిమానాలు విధింపు..!!

యూఏఈ: 53వ యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా అజ్మాన్ పోలీసులు కొరడా ఝులిపించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, దుష్ప్రవర్తన కారణంగా అనేక వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది. అజ్మాన్ బీచ్ రోడ్డులో ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా ఈ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు పేర్కొన్నారు.  ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించామని, వీటిలో ప్రజలకు ప్రమాదం కలిగించే రీతిలో డ్రైవింగ్ చేయడం, శబ్దానికి అంతరాయం కలిగించడం, వాహన ఇంజిన్‌లో మార్పులు చేయడం, వాహన అలంకరణ నియమాలను ఉల్లంఘించడం వంటివి ఉన్నాయని తెలిపారు.   అదే సమయలో డ్రైవర్లు, ప్రయాణీకులు స్ప్రే సాధనాలను ఉపయోగించడం, వాహనం సన్‌రూఫ్, కిటికీల నుండి బయటకు నిల్చోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు నిబంధనలు, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com