వంతెనపై రెండు వాహనాలు ఢీ..ఒకరు మృతి..!!

- December 03, 2024 , by Maagulf
వంతెనపై రెండు వాహనాలు ఢీ..ఒకరు మృతి..!!

కువైట్: సులైబిఖత్ ప్రాంతానికి సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఐదవ రింగ్ రోడ్డు (షేక్ జాయెద్ రోడ్)పై ఈ దుర్ఘటన జరిగింది.  అధికారుల కథనం ప్రకారం.. వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం  వాటిలో ఒక వాహనం వంతెనపై నుండి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com