బహ్రెయిన్ కు దక్కిన ఆసియా యూత్ గేమ్స్ ఆతిథ్య హక్కులు..!!
- December 03, 2024
మనామా: 2025లో 3వ ఆసియా యూత్ గేమ్స్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) వెల్లడించింది. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరగాల్సిన ఈవెంట్‌ను రద్దు చేయడంతో.. దానిని బహ్రెయిన్ లో నిర్వహించాలని OCA ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. వాస్తవానికి తాష్కెంట్‌లో కొత్తగా నిర్మించిన ఒలింపిక్ విలేజ్‌లో జరగాల్సిన గేమ్స్.. లాజిస్టికల్, స్థానిక సమస్యల కారణంగా ఆలస్యం కానున్నాయి. దీంతో బహ్రెయిన్ లో ఉన్న బలమైన మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లను హోస్ట్ చేసే అవకాశాన్ని బహ్రెయిన్ కు అప్పగించింది.
ప్రపంచ క్రీడలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్ ఎదుగుదలకు ఇది మరో మైలురాయిని సూచిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల నుండి హై-ప్రొఫైల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ల వరకు నిర్వహించడంలో ఖలీఫా స్పోర్ట్స్ సిటీ, బహ్రెయిన్ నేషనల్ స్టేడియం వంటి ఆధునిక సౌకర్యాలు క్రీడల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు







