కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసిన ఏపీ మంత్రి వర్గం
- December 03, 2024
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీర్ ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారుల్ని నిలదీశారు.
ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ టాక్ ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బ్యూరోక్రసీ డిలే వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని చంద్రబాబు చెప్పారు.
జేజేఎం ప్రతి ఒక్కరికీ రీచ్ అయ్యే అతి పెద్ద ప్రాజెక్టని లోకేశ్ అన్నారు. పథకాలు సక్రమ వినియోగం పై అధికారులు దృష్టి పెట్టాలని గట్టిగా చెప్పారు సీఎం చంద్రబాబు. పులివెందుల, ఉద్దానం, డోన్ లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల విజిబిలిటీ పెరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
డిసెంబర్ 12న ప్రభుత్వం ఏర్పడి 6నెలలు పూర్తవుతుంది కాబట్టి ఎవరేం చేశారో సమగ్ర నివేదిక ఇస్తే స్ట్రీమ్ లైన్ చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. లిక్కర్, ఇసుక మాఫియాలను అరికట్టామని, చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవీ పరిష్కరిస్తామని చెప్పారు. రేషన్ మాఫియాను అరికడుతున్నాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా రెవెన్యూ సమస్యలూ పరిష్కరిస్తున్నామని అన్నారు.
డిసెంబర్ 15వ తేదీన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయం చెప్పారు. ఐటీ, టెక్స్టైల్, మారీటైమ్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపారు. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో పలు సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకు ఆమోదం పడింది. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోద ముద్ర పడింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..