దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్.. 38 రోజుల పాటు డ్రోన్, ఫైర్ వర్క్స్ షోలు..!!
- December 04, 2024
దుబాయ్: డిసెంబర్ 6 నుండి దుబాయ్ లో ప్రతిరోజూ ఫైర్ వర్క్స్, రెండు డ్రోన్ షోలు సందడి చేయనున్నాయి. మొదటిసారిగా ఫైర్ వర్క్స్, డ్రోన్లు షో దుబాయ్ ఆకాశలో వెలుగులు నింపనుంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డీఎస్ ఎఫ్)లో భాగంగా వచ్చే ఏడాది జనవరి 12 వరకు 38 రోజుల పాటు షోలు నిర్వహించనున్నారు. దాదాపు 150 పైరో డ్రోన్లు బ్లూవాటర్స్, జేబీఆర్ బీచ్ లో డిసెంబర్ 13న రాత్రి 8 గంటలకు స్కైడైవర్లతో.. మళ్లీ రాత్రి 10 గంటలకు షో ఉంటుంది. జనవరి 11న ముగింపు వారాంతంలో 150 పైరో-డ్రోన్ డిస్ప్లేలు మళ్లీ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. అదే విధంగా DSF డ్రోన్స్ షో బ్లూవాటర్స్ ఐలాండ్ , జేబీఆర్ బీచ్ లో రాత్రి 8 గంటలకు, 10 గంటలకు రెండుసార్లు రోజువారీ ప్రదర్శనలను నిర్వహించనున్నారు.
దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్లో రాత్రి 9.15 గంటలకు ఉచిత రోజువారీ ఫైర్ వర్క్స్, వారాంతాల్లో రాత్రి 8 గంటలకు హట్టాలో వారానికి రెండుసార్లు ప్రదర్శనలు నిర్వహిస్తారు. సందర్శకులు బ్లూవాటర్స్ ఐలాండ్, అల్ సీఫ్, దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్, అల్ మార్మూమ్, కైట్ బీచ్, సిటీ వాక్‌తో పాటు DSF సిగ్నేచర్ ఈవెంట్లతో ఇంటరాక్టివ్ అనుభవాలను అందజేస్తుందని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







