రియాద్ జనాభాలో సగానికి పైగా విదేశీయులు..!!

- December 04, 2024 , by Maagulf
రియాద్ జనాభాలో సగానికి పైగా విదేశీయులు..!!

రియాద్: రియాద్ నగర జనాభాలో సగానికి పైగా సౌదీయేతర నివాసితులు ఉన్నారని రియాద్ మేయర్ ప్రిన్స్ డా. ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అయ్యఫ్ తెలిపారు. ఇది రియాద్ ఆర్థిక బలం, వైవిధ్యం, ఆకర్షణను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం సౌదీ-ఫ్రెంచ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రిన్స్ ఫైసల్ సౌదీ అరేబియా, ఫ్రాన్స్ మధ్య ఒక శతాబ్దానికి పైగా ఉన్న దీర్ఘకాల సంబంధాలను వివరించారు.

1967లో కింగ్ ఫైసల్ ఫ్రాన్స్ పర్యటన,  ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచాయన్నారు.  క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2018 ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా సౌదీ-ఫ్రెంచ్ కంపెనీల మధ్య $18 బిలియన్లకు పైగా విలువైన 19 ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. పెట్రోకెమికల్స్, వాటర్ ట్రీట్‌మెంట్, టూరిజం, కల్చర్ వంటి రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.  1997లో అప్పటి రియాద్ గవర్నర్‌గా ఉన్న రాజు సల్మాన్ పర్యటన సందర్భంగా రియాద్ -ప్యారిస్ మధ్య ప్రత్యేక సంబంధం ఏర్పడిందన్నారు.   

సౌదీ విజన్ 2030లో భాగంగా రియాద్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక మార్పుల గురించి ప్రిన్స్ ఫైసల్ వివరించారు. సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తుకు మార్గదర్శి నగరంగా రియాద్ నిలుస్తుందన్నారు. ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటిగా నిలిచిందన్నారు.  ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజా రవాణా కార్యక్రమాలలో ఒకటైన రియాద్ మెట్రో ప్రాజెక్ట్.. అలాగే దిరియా, కిద్దియా,  కింగ్ సల్మాన్ ఎకనామిక్ పార్కుల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులు జీవన నాణ్యతను మెరుగుపరచడం, రియాద్‌ను ప్రధాన ప్రపంచ గమ్యస్థానంగా స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com