రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్
- December 07, 2024
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ సంఘటనపై స్పందించిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం అని తెలిపిన ఆయన ఆమె మృతికి నా తరుపున మా టీమ్ తరుపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిసి నాతోపాటు పుష్ప టీమ్ అంతా కూడా షాక్కు గురైంది. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. మేము సినిమా తీసేదే ప్రేక్షకులు తేటర్ కొచ్చి చూసి ఆనందించడానికి అని తెలిపిన అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి నా తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్న అని ప్రకటించాడు. వాళ్ళ కొడుకు హాస్పటల్ ట్రీట్మెంట్ ఖర్చు అంతా మేమే భరిస్తాం అని మరొక సారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడతామని తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







