సౌదీ అరేబియాలో 121% పెరిగిన టూర్ గైడ్ లైసెన్స్‌లు..!!
- December 07, 2024
రియాద్ : సౌదీ అరేబియా టూర్ గైడ్ లైసెన్స్‌ల జారీలో పెరుగుదలను నమోదుచేసింది. 2024 మొదటి తొమ్మిది నెలల్లో 121% వృద్ధిని సాధించింది. టూరిజం గైడ్ లైసెన్స్‌ల సంఖ్య 2,500 దాటిందని, గత ఏడాది ఇదే కాలంలో కేవలం 1,100 మాత్రమే ఉన్నాయని పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2024 మొదటి తొమ్మిది నెలల్లో సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాలలో పర్యాటక కార్యకలాపాల లైసెన్సుల సంఖ్యలో వృద్ధిని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రావెల్ మరియు టూరిజం సర్వీస్ లైసెన్స్‌ల సంఖ్య 2,600ని అధిగమించిందని, ఇది 2023లో ఇదే కాలంతో పోలిస్తే 49% పెరిగిందని పేర్కొన్నారు. లైసెన్సింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దాని నిరంతర ప్రయత్నాలే ఈ వృద్ధికి కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది అర్హత కలిగిన వ్యక్తులు పరిశ్రమలోకి ప్రవేశించడాన్ని సులభతరం చేస్తుందన్నారు. దాంతోపాటు అన్ని టూర్ గైడ్‌లు టూరిజం చట్టంలో పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉండేలా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని, పర్యాటకులకు అధిక ప్రమాణాల సేవలకు అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







