అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతం పునరుద్ధరణ..!!

- December 07, 2024 , by Maagulf
అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతం పునరుద్ధరణ..!!

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ విలాయత్ ఆఫ్ సీబ్‌లోని అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈప్రాంతం నడక మార్గాలు, పార్కింగ్ స్థలాల పునురుద్ధరణ ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

ప్రాజెక్ట్ ముఖ్య అంశాలు:

-38,000 చదరపు మీటర్ల నడక మార్గాల పునరుద్ధరణ.

-26,000 చదరపు మీటర్ల పార్కింగ్ స్థలాల ఏర్పాటు.

-58 బెంచీలు, చెట్లను నాటడం, ల్యాండ్‌స్కేపింగ్‌ పనులు ప్రారంభం

-మౌలిక సదుపాయాల అభివృద్ధి: సమీకృత నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు.

-ప్రాంతం మొత్తం రూపాన్ని మెరుగుపరచడానికి బ్యూటీ పోల్స్  సంస్థాపన.

ఈ సమగ్ర పునరుద్ధరణను చేపట్టడం ద్వారా అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతానికి నివాసితులు, సందర్శకులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం తమ లక్ష్యమని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com