ఒమన్ రికార్డు.. OMR6.063 బిలియన్ల సరప్లస్ నమోదు..!!

- December 08, 2024 , by Maagulf
ఒమన్ రికార్డు.. OMR6.063 బిలియన్ల సరప్లస్ నమోదు..!!

మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ వాణిజ్య బ్యాలెన్స్ సెప్టెంబర్ 2024 చివరి నాటికి OMR6.063 బిలియన్ల సరప్లస్ (మిగులు)ను నమోదు చేసింది. అదే 2023లో ఇదే కాలంలో OMR5.611 బిలియన్లుగా ఉంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల గణాంకాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 2024 చివరి నాటికి వస్తువుల ఎగుమతుల విలువ OMR18.611 బిలియన్‌లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం (OMR16.950 బిలియన్లు)ఇదే కాలంతో పోలిస్తే 10% పెరిగింది.  అదే సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ OMR 12.178 బిలియన్లకు చేరుకుంది.ఇది గతేడాది (OMR 10.979 బిలియన్ల) కంటే 10.9% అధికం.

సెప్టెంబర్ 2024 వరకు ఒమన్ ఎగుమతుల్లో చమురు, గ్యాస్ ఎగుమతుల విలువ OMR 12.406 బిలియన్లకు పెరిగింది. సెప్టెంబర్ 2023తో పోలిస్తే 21.5% పెరుగుదల(OMR10.213 బిలియన్లు) నమోదైంది.  LNG ఎగుమతుల విలువ 7% తగ్గి OMR 1. 822 బిలియన్లకు చేరింది. ఇక చమురుయేతర వస్తువుల విలువ సెప్టెంబర్ 2024 చివరి నాటికి 14.1 శాతం తగ్గి OMR 4.534 బిలియన్లకు చేరుకుంది.  మెటల్ ఉత్పత్తుల విలువ OMR1.307 బిలియన్లు, 2023లో ఇదే కాలంతో పోలిస్తే 27.3% తగ్గింది. రసాయన పరిశ్రమల ఉత్పత్తుల విలువ 25. 1% తగ్గి OMR575 మిలియన్లకు చేరుకుంది. సెప్టెంబరు చివరి వరకు చమురుయేతర ఉత్పత్తులలో వాణిజ్య మార్పిడిలో OMR 737 మిలియన్ల విలువతో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే 2024 సెప్టెంబర్ చివరి నాటికి OMR 14.1% పెరిగింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com