టూరిస్ట్ వీసా డివైజ్.. రికార్డు సమయంలో వీసాల జారీ..!!
- December 10, 2024
రియాద్: నిబంధనలకు అనుగుణంగా పర్యాటకులు తమ వీసాలను రికార్డు సమయంలో పొందేందుకు వీలుగా డైరెక్టరేట్ టూరిస్ట్ వీసా డివైజ్ ను ప్రారంభించిందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ ప్రతినిధి మేజర్ నాసర్ అల్-ఒటైబి తెలిపారు. అన్ని అంతర్జాతీయ నౌకాశ్రయాలలో అందుబాటులో ఉన్న పర్యాటక వీసా డివైజ నుండి పర్యాటకులు ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.పాస్‌పోర్ట్‌ను స్కాన్ చేయడం, ఆపై పర్యాటకుల ఫోటో, వేలిముద్ర తీసుకోవడం, ఆరోగ్య బీమాను పరిశీలించడంతోపాటు చెల్లింపు కోసం వివిధ రకాల కార్డులను అనుమతించడం వంటి ఐదు దశల ద్వారా వీసా జారీ అవుతుందన్నారు. ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2019లో ప్రారంభించబడిన ఈ డివైజ్ ద్వారా ప్రపంచంలోని 49 దేశాల పౌరులు లబ్ది పొందేందుకు వీలు కల్పించినట్టు తెలిపారు. ఇది రాజ్యంలో పర్యాటక రంగాన్ని మెరుగుపరచడానికి, విజన్ 2030 యొక్క లక్ష్యాలను సాకారం చేయడంలో సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







