మే 2025లో అల్ ఐన్‌లో ఫ్లయింగ్ టాక్సీ ట్రయల్స్..!!

- December 11, 2024 , by Maagulf
మే 2025లో అల్ ఐన్‌లో ఫ్లయింగ్ టాక్సీ ట్రయల్స్..!!

యూఏఈ: అబుదాబికి చెందిన ఫాల్కన్ ఏవియేషన్ సర్వీసెస్ జనవరి 1 నుండి యూఏఈలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఫాల్కన్ ఏవియేషన్ సర్వీసెస్ సీఈఓ రామన్‌దీప్ ఒబెరాయ్ తెలిపారు. మార్చి 2024లో యుఎస్‌కు చెందిన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ మేకర్ ఆర్చర్ ఏవియేషన్, యూఏఈలోని ఏవియేషన్ సర్వీసెస్ ఆపరేటర్ ఫాల్కన్ ఏవియేషన్, దుబాయ్ - అబుదాబిలోని కీలకమైన ప్రదేశాలకు వెర్టిపోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భాగస్వాములుగా ఉండటానికి ఒప్పందంపై సంతకం చేశాయి.

ఆర్చర్, ఫాల్కన్ ఏవియేషన్ అట్లాంటిస్.. దుబాయ్‌లోని పామ్, అబుదాబి కార్నిచ్‌లోని మెరీనా మాల్ హెలిపోర్ట్‌లలో అత్యాధునిక వెర్టిపోర్ట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. రెండు సంస్థలు ఈ రెండు ఫాల్కన్ వెర్టిపోర్ట్‌ల మధ్య ఆర్చర్స్ మిడ్‌నైట్ ఫ్లయింగ్ టాక్సీలో ప్రయాణీకుల సేవను అందిస్తాయి. ఇవి రెండు నగరాల సుందరమైన వీక్షణలతో దాదాపు పూర్తిగా నీటి మీదుగా నడుస్తాయి. టేకాఫ్ నుండి ల్యాండింగ్ వరకు 30 నిమిషాల సమయం పడుతుంది.  

కాగా, ఆర్చర్ ఏవియేషన్ ఈ నెల ప్రారంభంలో 2026 మొదటి త్రైమాసికంలో అబుదాబిలో మొదటి కమర్షియల్ ఫ్లయింగ్ కార్ ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మంగళవారం దుబాయ్‌లో జరిగిన మెబా 2024 ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ సందర్భంగా ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఆర్చర్స్ ఫ్లయింగ్ కార్ మిడ్‌నైట్ ట్రయల్స్ మే 2025లో అల్ ఐన్‌లో 3-4 నెలల పాటు కొనసాగుతుందన్నారు. ఆపై అబుదాబిలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ ట్యాక్సీ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ట్రయల్ చేయబడుతోందని పేర్కొన్నారు. అబుదాబి, దుబాయ్‌లు ఈ కొత్త మోడల్ రవాణాను పరిచయం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇది ప్రారంభంలో ఒక అనుభవంగా ఉంటుందని, అయితే పెరుగుతున్న రహదారి ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి రాబోయే సంవత్సరాల్లో ఇది అవసరం అవుతుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com