పార్కింగ్ వద్ద గొడవ.. భారతీయ వ్యక్తిపై దాడి..వ్యక్తికి జైలు, బహిష్కరణ వేటు..!!
- December 13, 2024
యూఏఈ: దుబాయ్‌లో పార్కింగ్ స్థలం వద్ద ఘర్షణ సందర్భంగా 34 ఏళ్ల భారతీయ వ్యక్తికి శాశ్వత వైకల్యానికి కారణమైన 70 ఏళ్ల పాకిస్తాన్ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష ముగిసిన తర్వాత ఆ వ్యక్తిని కూడా బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన గత ఏడాది ఫిబ్రవరి 8న ఎమిరేట్స్ టెకామ్ ప్రాంతంలోని నివాస భవనం వెలుపల పార్కింగ్ స్థలం వద్ద జరిగింది.
కోర్టు పత్రాల ప్రకారం.. పాకిస్తానీ వ్యక్తి భారతీయ వ్యక్తి ఉపయోగించిన పార్కింగ్ స్థలాన్ని క్లెయిమ్ చేయడంతో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పాకిస్తానీ వ్యక్తి బలవంతంగా నెట్టడంతో భారతీయ వ్యక్తి నేలపై పడి గణనీయమైన గాయాలకు గురయ్యాడు. ఇందులో నరాల దెబ్బతినడం, కండరాల క్షీణత, 50 శాతం కాలు పనిచేయకుండా పోయింది. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ పాకిస్తానీ వ్యక్తి నేరాన్ని నిర్ధారించింది.కాగా, ఇదే కేసులో 34 ఏళ్ల భారతీయ వ్యక్తిపై నమోదైన కేసు తదుపరి విచారణ కోసం మిస్డిమినర్ కోర్టుకు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







