వాట్సాప్ కొత్త ఫీచర్, గ్రూపులో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో తెలుసుకోవడం ఈజీ

- December 14, 2024 , by Maagulf
వాట్సాప్ కొత్త ఫీచర్, గ్రూపులో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో తెలుసుకోవడం ఈజీ

వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మరింత మందికి చేరువ అవుతోంది. తాజాగా వాట్సాప్ తన యూజర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫీచర్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో తెలుసుకోవడం ఒక ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది ఇతర యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ చాట్స్ లో టాప్ బార్ లో ఆన్ లైన్లో ఉన్న వారి సంఖ్యను డిస్ ప్లే చేస్తుంది. ఇది గ్రూప్ లో సంభాషణలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం గ్రూప్ లో ఏదైనా మెసేజ్ చేస్తే అందరూ చూసి స్పందించడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ లోని సభ్యుల్లో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో చెక్ చేసుకుని మెసేజ్ చేస్తే ఇతరుల నుంచి రెస్పాన్స్ చాలా తొందరగా పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది యాక్టివ్ గా ఉన్నప్పుడు సందేశాలు షేర్ చేస్తే త్వరగా సమాచారం చేరుతుంది.

ఈ ఫీచర్ ఆన్ లైన్ స్టేటస్ అవైలబుల్ అని సెట్ చేసుకున్న యూజర్లను మాత్రమే ఆన్ లైన్లో ఉన్నారో తెలుపుతుంది. ఆన్ లైన్ స్టేటస్ తెలియకుండా సెట్ చేసుకుంటే మాత్రం వారిని ఆన్ లైన్లో చూపించదు. వారి ప్రైవసీకి భంగం కలిగించకుండా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్ కలిగి ఉన్న కొద్దిమంది బీటా టెస్టర్లు ఈ ఫీచర్ ను చెక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. 

ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ గ్రూప్ చాట్స్ లో సంభాషణలను మరింత సులభతరం చేస్తుంది. గ్రూప్ లో ఎంతమంది ఆన్ లైన్లో ఉన్నారో తెలుసుకోవడం ద్వారా మెసేజ్ లకు త్వరగా స్పందన పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com