అలెర్ట్..అజ్మాన్ ట్రాఫిక్ జరిమానాల పై 50% తగ్గింపు..!!
- December 15, 2024
అజ్మాన్: ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపును అజ్మాన్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు. డిసెంబర్ 15తో షెడ్యూల్ గడువు ముగియనుంది. అయితే, ఇది "తీవ్రమైన ఉల్లంఘనలను" కవర్ చేయదని అథారిటీ తెలిపింది. తేలికైన లేదా భారీ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, ఓవర్‌టేకింగ్ నిషేధించబడిన ప్రదేశంలో ట్రక్కు డ్రైవర్లు ఓవర్టేక్ చేయడం, గరిష్ట వేగ పరిమితిని 80కిమీ కంటే ఎక్కువ దాటడం,ముందస్తు అనుమతి లేకుండా వాహనంలో మార్పులు చేయడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ వర్తించదు. వాహన యజమానులందరూ ఈ నిర్ణయాన్ని సద్వినియోగం చేసుకోవాలని , జరిమానాలను చెల్లించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.సేవా కేంద్రాలు, అంతర్గత మంత్రిత్వ శాఖ యాప్, అజ్మాన్ పోలీస్ యాప్ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడవద్దని, సీటు బెల్టులు ధరించాలని సూచించింది. లేదంటే ఫెడరల్ చట్టం ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్‌పై 400 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి