ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!
- December 16, 2024
న్యూ ఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు.ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దిసనాయకే తొలి విదేశ పర్యటన ఇదే. చర్చలకు ముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు.ప్రధాని మోదీ, అనుర దిసానాయక్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరించారు.
ఇరుదేశాల మధ్య ఒప్పందం
ఈ సందర్భంగా రెండు దేశాలమధ్య కొన్ని కీలక అంశాలపై ఒప్పందం కుదిరింది.
వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా సహకారంపై ఒప్పందం జరిగినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తున్న దిసనాయకేను కలవడం ఆనందంగా ఉందన్నారు.
దేశాల ప్రయోజనాల కోసం..
నైబర్‌హుడ్ ఫస్ట్ విధానం, సాగర్ ఔట్‌లుక్‌కి శ్రీలంక కీలకమైందని.. ప్రధాని మోదీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోగా..కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌తో పాటు అధికారులు స్వాగతం పలికారని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలో పిన్న వయసులో ప్రెసిడెంట్ గా ఎన్నికై, తొలిసారిగా మన దేశానికి వచ్చారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు