నేడు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- December 17, 2024 , by Maagulf
నేడు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 

- ఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ము
- మ.12:05 గంటలకు మంగళగిరిలోఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ము
- పాల్గొననున్న గవర్నర్‌ నజీర్‌, చంద్రబాబు, పవన్‌
- సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

అమరావతి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు మంగళగిరిలోఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు.

మంగళగిరి ఎయిమ్స్‌ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. పర్యటనలో భాగంగా ఆమె విజయవాడలోని పలు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరి, అక్కడి రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఆమె సందర్శనతో నగరంలో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటన విజయవంతంగా ముగియాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com