షార్జా ఆర్ టి ఏ 98 మిలియన్ల డి హెచ్ తో రహదారి విస్తరణ అభివృద్ధి

- June 27, 2016 , by Maagulf
షార్జా ఆర్ టి ఏ  98 మిలియన్ల డి హెచ్ తో రహదారి విస్తరణ అభివృద్ధి

అల్ మేడమ్ రోడ్డు - దుబాయ్ తో కతాహ్ నాజ్వా  రోడ్లని కలిపే కీలక రహదారి విస్తరణ 50 శాతం మేరకు  అభివృద్ధి చేసింది. ఇందుకోసం 98 మిలియన్ దిర్హాములతో  రహదారి విస్తరణ అభివృద్ధిని షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిర్మించనుంది.  
ఎమిరేట్ మధ్య ప్రాంతంలో ఉన్న ఈ  రహదారి వ్యూహాత్మకంగా ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని ఆలోచిస్తున్నామని ఆర్.టి.ఎ షార్జ చైర్మన్ ఇంజినీర్  యూసఫ్ సాలెహ్ అల్ సువైహి తెలిపారు
రెండు వరుసల రహదారిని 12.4 కిలోమీటర్ల  దూరం విస్తరించటం, మీడియాన్ రోడ్ ఐలాండ్ వరకు   4.6 మీటర్ల వెడల్పుతో రెండు దిశలలో న 2.5 మీటర్ల తారు రోడ్లని  భారీ ట్రక్కుల సహాయంతో నిర్మించనున్నారు.
ప్రజా భద్రత మరియు భద్రతా మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ  ప్రాజెక్టు షార్జా సుప్రీం కౌన్సిల్ మరియు రూలర్ సభ్యుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖ్అసిమి ఆదేశాలతో కొనసాగుతున్నట్లు  తెలిపారు.కొత్త రహదారి వివిధ  ప్రాంతాలని  మరియు జిల్లాలని అనుసంధించడంతో ఎమిరేట్ రోడ్లు సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. అలాగే దేశంలోని వివిధ ఫెడరల్ రహదారులని సైతం కలుపుతుంది అన్నారు. ప్రాజెక్ట్ పట్టణ విస్తరణ యొక్క ప్రస్తుత మరియు డేటా , ఫీడ్ బ్యాక్ , విచారణలు, వ్యాఖ్యలు మరియు ఫిర్యాదులు (600525252) చేసేందుకు  కాల్ సెంటర్ 24/7 కాలంలో  వినియోగదారులు ఫోన్  చేయవచ్చని ఆయన  విజ్ఞప్తి చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com