మాగ్డేబర్గ్ దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- December 21, 2024
రియాద్: జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరంలోని సందడిగా ఉన్న క్రిస్మస్ మార్కెట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ ఘటనలో కారు జనంపైకి దూసుకెళ్లడంతో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, కింగ్‌డమ్ బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని, జర్మన్ ప్రజలకు సంఘీభావం తెలిపింది. సౌదీ అరేబియా కూడా అన్ని రకాల హింసకు వ్యతిరేకంగా తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
జర్మన్ అధికారుల ప్రకారం.. ఈ దాడి సాయంత్రం 7 గంటలకు జరిగింది. క్రిస్మస్ మార్కెట్ సెలవు దుకాణదారులతో రద్దీగా ఉన్నప్పుడు చోటుచేసుకుంది. ఒక కారు మార్కెట్‌లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక ఉగ్రకోణం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







