కువైట్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది

- December 21, 2024 , by Maagulf
కువైట్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది

కువైట్ సిటీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది కువైట్ చేరుకున్నారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన మోది కువైట్‌లో దిగగానే ఘన స్వాగతం పొందారు. కువైట్ అధికారులు మరియు భారతీయులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలను ప్రధాని శ్రద్ధగా తిలకించారు మరియు వారితో ముచ్చటించారు. 

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోఢీ కువైట్ అగ్ర నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్, మరియు ప్రధానమంత్రి అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సబాహ్ వంటి ప్రముఖులతో చర్చలు జరపనున్నారు. అంతేకాక, కువైట్‌లో నివసిస్తున్న భారతీయులను కలుసుకుని, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. భారత కార్మిక శిబిరాన్ని సందర్శించి, వారి పరిస్థితులను పరిశీలించనున్నారు. కువైట్ రాష్ట్ర అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. 43 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి కువైట్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 

కువైట్‌కు బయలుదేరే ముందు భారతదేశంలో ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ భారతదేశం మరియు కువైట్ మధ్య ప్రాచ్యంలో శాంతి, భద్రత, స్థిరత్వం మరియు శ్రేయస్సును నెలకొల్పడంలో భారతదేశం మరియు కువైట్ ఉమ్మడి బంధాన్ని పంచుకుంటున్నాయని తెలిపారు.
వాణిజ్యం మరియు ఇంధన రంగాలలో భారతదేశం మరియు కువైట్ మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందని, ఇరు దేశాలు మరియు వారి ప్రజల ప్రయోజనాల కోసం భవిష్యత్ భాగస్వామ్యానికి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని తాను ఆశిస్తున్నానని వివరించారు.

ఈ పర్యటన కువైట్ మరియు భారతదేశం మధ్య ప్రత్యేక సంబంధాలను మెరుగుపరచడానికి మరియు బలోపేతం చేయడానికి మరియు ప్రజల మధ్య స్నేహాన్ని మరింతగా పెంచడానికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం సబా సాలెం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రధాన మంత్రి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే ఇవాళ జరగనున్న గల్ఫ్ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ కు కూడా ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రేపటి నుంచి కువైట్ ఎమిర్, క్రౌన్ ప్రిన్స్ తదితరులతో కూడా మోదీ సమావేశం కానున్నారు. 

ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, కువైట్‌లో ఉన్న భారతీయ ప్రవాస సమాజానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా భారతదేశం మరియు కువైట్ మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com