ఒమన్‌లో పెరిగిన ఒమనైజేషన్ రేట్లు.. టార్గెట్ రీచ్..!!
- December 22, 2024
మస్కట్: ఒమన్‌లోని పారిశ్రామిక రంగం ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ చివరి వరకు ఒమనైజేషన్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. జాతీయ శ్రామిక శక్తి ఉపాధి కోసం నిర్దేశించిన లక్ష్యాలను 5.5% అధిగమించింది. ఈ మేరకు పారిశ్రామిక రంగంలోని వివిధ స్పెషలైజేషన్లు, రంగాల్లోని కార్మిక మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. నవంబర్ 2024 చివరి నాటికి జాతీయ శ్రామిక శక్తి సుమారు 30,993కి చేరుకుందని, ఈ సంవత్సరం 1,000 మంది ఒమానీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని అధిగమించిందని ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అహ్మద్ బిన్ ఖల్ఫాన్ అల్-బదావి తెలిపారు. రాబోయే కాలంలో టెక్నాలజీ, ప్రత్యేక ఉద్యోగాలను స్థానికీకరించడంపై ఎక్కువ దృష్టి పెడతామన్నారు.2024 మధ్యలో అమలులోకి వచ్చిన పారిశ్రామిక వ్యూహం సానుకూల ఫలితాలను ఇచ్చిందని అల్-బదావి హైలైట్ చేశారు. వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని ఇండస్ట్రియల్ స్ట్రాటజీ టీమ్ ఈ సంస్థలతో వర్క్‌షాప్‌లను నిర్వహించడం కూడా కలిసివచ్చిందన్నారు.ఈ ప్రయత్నాలు కొత్త హైటెక్ పరిశ్రమలను స్థాపించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పారిశ్రామిక అభివృద్ధి నిర్వహణను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







