దుబాయ్ లో ఘనంగా మాజీ సీఎం వైస్ జగన్ పుట్టినరోజు వేడుకలు!!!

- December 22, 2024 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా మాజీ సీఎం వైస్ జగన్ పుట్టినరోజు వేడుకలు!!!

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మాజీ మంత్రి వర్యులు కారుమూరి వెంకటనాగేశ్వరావు, వైఎస్ఆర్సిపి NRI కమిటీ అడ్వైజర్ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్ఆర్సిపి యూఏఈ కో కన్వినర్ మైనర్ బాబు,సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి,తరపట్ల మోహన్ ,పాస్టర్ బుంగా డేవిడ్ గారు,యాండ్రా వెంకట్, పాస్టర్ ఐజాక్, పాస్టర్ రామరాజు, పాస్టర్ జయరాజు,మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు భారత దేశం వెలుపల అత్యంత ఎక్కువ అభిమానులు పాల్గొన్న వేడుకగా  దుబాయ్ లో నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే, దుబాయ్ లో నివసిస్తున్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు జగనన్న అభిమానులు బర్ దుబాయ్ ప్రాంతంలోని హోటల్ విస్తా లో జగనన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దాదాపు 350 మంది కార్యకర్తలు మరియు జగనన్న అభిమానులు పాల్గొని మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
జగనన్న జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన అనంతరం  కార్యక్రమానికి విచ్చేసిన 
వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత కారుమూరి వెంకటనాగేశ్వరావు, మైనర్ బాబు, శ్రీనివాస్ చౌదరి, తరపట్ల మోహన్,
 ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన పాలనలో జరిగిన అభివృద్ధిని మరియు సంక్షేమ కార్యక్రామాలని గుర్తు చేసి వివరిస్తూ మళ్లీ వచ్చే ఎలక్షన్లలో పార్టీ కార్యకర్తలు  అభిమానులు ఎటువంటి విభేదాలు లేకుండా, ఒకరినొకరు కలుపుకొని, ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తీ వంచన లేకుండా కృషి చేసి మళ్లీ వైఎస్ఆర్సిపి పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుని మన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమాన్ని విచ్చేసి, విజయవంతం చేసిన కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కటికితల ప్రకాష్,యాండ్రా వెంకట్,కళ్యాణ్, ప్రభుదాస్, చింటు, కాగిత కుమార్,సాంబార్ మణి, మారుమూడి సుధా,గుబ్బల పద్మ,విజయ,తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com