మళ్ళీ మొదలైన 'పందెం కోడి - 2'
- June 27, 2016
విశాల్-లింగుసామి 'పందెంకోడి' సినిమాకి సీక్వెల్ రానుందంటూ ఎన్నాళ్ళుగానో వార్తాలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ''ఇదిగో.. అదిగో..'' అంటూ ఈ విషయంపై మాట దాటవేస్తూ వచ్చిన విశాల్ ఈ ఫిబ్రవరిలో 'పందెంకోడి-2' సెట్స్మీదికెళ్ళనుందని ప్రకటించాడు. అయితే దర్శకుడు లింగుసామి తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేసే ప్రయత్నంలో 'పందెంకోడి'ని తిరిగి బుట్ట కింద పెట్టేశాడు. అప్పట్లో ఈ పరిణామంపై స్పందిస్తూ ''కమిటెడ్ ప్రాజెక్ట్స్ నుండి దర్శకులు ఇలా తప్పుకోవడం బాధాకరం'' అంటూ ట్విట్టర్లో తన గోడు వెల్లబోసుకున్న మన నల్లనయ్య మిల్కీ బ్యూటీ తమన్నాతో జంట కట్టి 'కత్తిసండై' అనే సినిమాని మొదలెట్టేశాడు. సురాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏ ద్విభాషా చిత్రం కోసమైతే లింగు లింగు మంటూ లింగుసామి హైదరాబాద్కి ఎగెసుకొచ్చారో ఆ సినిమా అతడి చేజారిపోయింది. ఇక చేసేది లేక విశాల్ వద్దకు చేరుకుని 'పందెంకోడి-2'ని మళ్ళీ బయటికి తీసుకొచ్చే పనుల్లో పడ్డాడు లింగుసామి. విశాల్ కూడా ఎలాంటి పంతానికి పోకుండా 'ప్రొసీడ్' అనడం విశేషం. విశాల్-లింగుసామి-యువన్ శంకర్ రాజా కలయికలో వచ్చిన 'పందెంకోడి' సీక్వెల్కి ఛాయాగ్రాడకుడిగా మది పనిచేయనున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బాగుంటుందన్న విశాల్ మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







