న్యూ ఇయర్ 2025..ఈ ఆరు ప్రాంతాల్లో అద్భుత ఫైర్ వర్క్స్ చూడొచ్చు..!!

- December 24, 2024 , by Maagulf
న్యూ ఇయర్ 2025..ఈ ఆరు ప్రాంతాల్లో అద్భుత ఫైర్ వర్క్స్ చూడొచ్చు..!!

యూఏఈ: దుబాయ్‌లోని ఆరు ప్రాంతాల నుండి కొత్త సంవత్సరం వేడుకలను ఆనందివచ్చు. ఈ ప్రాంతాలలో అద్భుతమైన ఫైర్ వర్కస్ ను చూడవచ్చు. ఈ ప్రదేశాలలో బుర్జ్ పార్క్, గ్లోబల్ విలేజ్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, అల్ సీఫ్, బ్లూవాటర్స్ అండ్ ది బీచ్, జేబీఆర్ హట్టా ఉన్నాయి.  

బుర్జ్ పార్క్ వద్ద, ఐకానిక్ బుర్జ్ ఖలీఫా ప్రదర్శనతో వెలిగిపోతుంది. డౌన్‌టౌన్ దుబాయ్‌పై ఆకాశం బాణసంచాతో మెరుస్తుంది.  

గ్లోబల్ విలేజ్‌లో డిసెంబర్ 31రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంటలకు ముగిసే ఏడు వేడుకల కౌంట్‌డౌన్ జరుగుతుంది. దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ ఫైర్ వర్క్స్ తోపాటు ఈజిప్షియన్ గాయకుడు మహమూద్ ఎల్ ఎస్సీలీ ప్రత్యేక ప్రదర్శనను చూడవచ్చు. చారిత్రాత్మకమైన అల్ సీఫ్ జిల్లాలో  అద్భుతమైన వీక్షణలు, ఫెస్టివ్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చని  దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) తెలిపింది.

ఈ న్యూఇయర్ వేడుకల కోసం 2025లో నగరం చుట్టూ ఉన్న మెరీనా మాల్ అల్ ఘుబైబా, బ్లూవాటర్స్, అల్ ఫాహిది, అల్ జద్దాఫ్ ప్రదేశాలలో ఫెర్రీ, వాటర్ టాక్సీ లేదా అబ్రా రైడ్‌ని బుక్ చేసుకోవడం ద్వారా దుబాయ్ లో వేడుకలను ఆస్వాదించవచ్చు. బుర్జ్ అల్ అరబ్ మెరీనా గార్డెన్‌లో స్టార్‌ల కింద గాలా డిన్నర్‌ని నిర్వహిస్తుంది.  

హట్టా వాడి హబ్‌లో, రివెలర్‌లు మిరుమిట్లు గొలిపే లైటింగ్ ప్రదర్శనలతో పాటు జిప్‌లైనింగ్, కయాకింగ్, లైవ్ మ్యూజిక్ వంటి కార్యకలాపాలతో ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.  రాఫెల్స్ ది పామ్ దుబాయ్‌లో రాయల్ మాస్క్వెరేడ్ బాల్ రాత్రి 7.30 నుండి వేడుకలు ప్రారంభం అవుతాయి.  దాంతోపాటు బ్లూవాటర్స్, పామ్ నఖీల్ మాల్, పామ్ వెస్ట్ బీచ్, అల్ సీఫ్, దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్, అల్ మర్మూమ్, సిటీ వాక్ మరియు హట్టాలో వేడుకలు కనువిందు చేయనున్నాయి.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com