యూఏఈలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు..!!
- December 24, 2024
యూఏఈ: దుబాయ్‌తో సహా యూఏఈ తూర్పు, ఉత్తర ప్రాంతాలు క్రిస్మస్ రోజున భారీ వర్షం కురుస్తుందని, ఇది వీకెండ్ వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆగ్నేయం నుండి ఉపరితల అల్పపీడన వ్యవస్థ ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM)లో వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ.. యూఏఈపై అల్పపీడన వ్యవస్థ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఫుజైరా, రస్ అల్ ఖైమా వంటి ఉత్తర ప్రాంతాలతోపాటు ఉత్తర అబుదాబి, దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అదే సమయంలో యూఏఈ వ్యాప్తంగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఇప్పుడు చాలా వరకు హెచ్చుతగ్గులకు గురవుతాయని తెలిపారు. ఈ నెలల్లో నివాసితులు, పర్యాటకులు కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 12°C, పగటిపూట గరిష్టాలు 25°Cకి చేరుకుంటాయని అన్నారు. యూఏఈలో శీతాకాలం డిసెంబర్ 21న ప్రారంభమైంది. ఇది మార్చి మధ్యకాలం వరకు ఉంటుందని హబీబ్ చెప్పారు. ఫిబ్రవరి నెలలో అత్యధిక వర్షపాతం కురుస్తుందన్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







