ముగిసిన అల్లు అర్జున్ విచారణ

- December 24, 2024 , by Maagulf
ముగిసిన అల్లు అర్జున్ విచారణ

పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ ముగిసింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు రెండున్నర గంటల పాటు బన్నీని విచారించారు. అంతసేపు విచారించినప్పటికీ అల్లు అర్జున్ కొంతమేరనే స్పందించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు ఈ పుష్ప రాజ్ నుంచి సమాధానమే రాలేదని తెలుస్తోంది. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ అల్లు అర్జున్ను విచారించారు. న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరు కావడం గమనార్హం. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అల్లు అర్జున్ను విచారించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా అల్లు అర్జున్ను సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లి అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో పిన్ టూ పిన్ విచారించనున్నారు.

మర్చిపోయాను.. గుర్తులేదన్న బన్నీ! 
సంధ్య థియేటర్ ఘటన కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన అల్లు అర్జున్ మరోసారి పోలీసు విచారణకు హాజరయ్యారు. ఏసీపీ నేతృత్వంలోని టీమ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కీలకమైన బౌన్సర్ల అంశంపై వేసిన ప్రశ్నలకు.. అల్లు అర్జున్ సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. 'మర్చిపోయాను.. నాకు తెలియదు.. గుర్తులేదు' అని చెప్పినట్టు తెలుస్తోంది.

బన్నీని ప్రశ్నించిన అధికారులు వీరే 
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు ఐకాన్ స్టాక్ అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలో బన్నీని ఏసీపీ రమేశ్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించారు. కేసు కోర్టు పరిధిలో ఉండడంతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. కాగా, చిక్కడపల్లి పీఎస్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com