కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ
- December 24, 2024
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన నివాసం నుంచి బయలుదేరిన బన్నీ, స్టేషన్‌కు చేరుకుని లాయర్ సమక్షంలో ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. తండ్రి అల్లు అరవింద్, లీగల్ టీమ్‌తో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఎసీపీ, సీఐలు ప్రశ్నలు అడుగుతున్నారు. అల్లు అర్జున్ స్టేషన్‌కు హాజరవుతుండడంతో చిక్కడపల్లి పీఎస్ వద్ద భద్రతను పెంచారు.అనవసర రద్దీ నివారించేందుకు రోడ్లు బ్లాక్ చేసి, వాహనాల రాకపోకలు నిలిపివేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.
సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు, అల్లు అర్జున్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. సంఘటనకు తాను బాధ్యుడిని కాదని, పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాతే థియేటర్‌కు వెళ్లినట్లు అల్లు అర్జున్ స్పష్టం చేశారు. అయితే, ర్యాలీ నిర్వహించి ప్రజలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘటనపై మీడియాతో మాట్లాడిన బన్నీ, తనపై వ్యక్తిగత దాడి జరుగుతోందని విమర్శించారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







