దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగు వారి క్రూజ్ క్రిస్మస్ సంబరాలు
- December 25, 2024
దుబాయ్: దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగువారు క్రూజ్ క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు.దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ శామ్యూల్ రత్నం, సిస్టర్ ఎస్తేరు ఆధ్వర్యంలో ఘనంగా Al Seef cruise నందు అంగరంగ వైభవంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. క్రైస్తవులు మరియు ఇతర మతస్థులందరూ 350 మందికి పైగా క్రిస్మస్ సంబరాలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెదేపా ముఖ్యనేత T.D.జనార్దన్, తణుకు తెదేపా ఎమ్మెల్యే అరిమల్లి రాధాకృష్ణ మరియు ఇతర సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా పాస్టర్ యేసు మేరీ జ్యోతి ఆధ్వర్యంలో బృందంగా క్రిస్మస్ కరల్స్ తో గాత్ర కచేరీలో అలరించారు.ఈ కార్యక్రమంలో బ్రదర్ అరవింద్ వుడ్స్- సాక్సోఫోన్, ఏలేటి వరప్రసాద్, పేడ్స్ వంటి సంగీత వాయిద్యాలను ప్లే చేశారు.ఈ కార్యక్రమంలో మరోక భాగంగా సిస్టర్ గ్లోరి ముఖ్య అతిథులను సత్కరించారు.ఈ కార్యక్రమంలో దుబాయ్ లోని వివిధ సంఘాల పోస్టర్స్ పాల్గొన్నారు. పాస్టర్ నేరపాటి ఇస్సాకు, పాస్టర్ G. భాగ్యనందం, పాస్టర్ రత్నరాజు, పాస్టర్ అడివల సంపదరావు, బ్రదర్ నసి కిరణ్,బ్రదర్ సతీష్ ఏలేటి బోయల్ మరియు మీడియా విభాగం మాగల్ఫ్, టీవీ 5 న్యూస్ నుంచి శ్రీకాంత్ చిత్తర్వు మరియు యూఏఈ NRI టిడిపి సభ్యులు ఈ క్రిస్మస్ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్నారు.
అలాగే, దుబాయ్ లో చర్చ్ ను నిర్మించుకునేందుకు దుబాయ్ ప్రభుత్వంతో మాట్లాడి భూమిని ఇప్పించాలని పాస్టర్లందరూ కలిసి తెదేపా సీనియర్ నేత టీడీ జనార్ధన్, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చర్చి నిర్మాణానికి అవసరమైన భూమిని ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
దుబాయ్ లో మునుపెన్నడూ కని విని ఎరుగని విధంగా క్రైస్తవ స్తోత్రం మరియు వాయిద్యాలతో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు.







తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







