'బాబు బంగారం' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది..
- June 27, 2016
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'బాబు బంగారం' సినిమాతో త్వరలో వినోదాల విందు వడ్డించనున్నారు వెంకటేష్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల గచ్చిబౌలిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చిందట. ఈ పాట కోసం చెన్నైలో ప్రత్యేక సెట్ సిద్ధం చేయించారట దర్శకుడు. జులై 4 నుండి 8 వరకు జరుగనున్న షూటంగ్తో ఈ పాట కూడా పూర్తవుతుందట. జిబ్రాన్ స్వరాలు సమకూర్చిన పాటలు జులై 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయట. జులై 29 నాటికి 'బాబు బంగారం'ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నయనతార కథానాయిక.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









