కువైట్ లో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష అమలు

- June 28, 2016 , by Maagulf
కువైట్ లో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష అమలు

డ్రగ్ కేసులో ముగ్గురు భారతీయులకు క్రిమినల్ కోర్టు విధించిన మరణశిక్షను అపిలేట్ కోర్టు సమర్థించింది. 2015లో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు భారతీయులతోపాటు ఓ శ్రీలంక దేశస్తుడిని అరెస్ట్ చేశారు. మార్చి, 2016లో క్రిమినల్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. మరణశిక్ష పడిన వీరిని కేరళకు చెందిన ఫైసల్ మంగట్టుచలీల్, ముస్తాఫా హమీద్, అబూబకర్‌గా గుర్తించారు. మరొకరు షరీకా బాలసింగే శ్రీలంక దేశీయుడు. కాగా వీరికి విధించిన మరణశిక్షను తాజాగా అలీ దిరాన్ సారథ్యంలోని అపిలేట్ కోర్టు సమర్థించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com