23 దేశాలకు వీసాల మంజూరును నిలిపివేయాలంటూ అమెరికన్ సెనేటర్ .
- June 28, 2016
23 దేశాలకు వీసాల మంజూరును నిలిపివేయాలంటూ ఒక టాప్ అమెరికన్ సెనేటర్ అమెరికా అధ్యక్షుడు ఒబామాను కోరారు. భారతదేశం , చైనా సహా 23 దేశాల పౌరులకు ఇచ్చే వలస, వలసేతర వీసాలు జారీని ఆపి వేయాలని ఒబామా అడ్మినిస్ట్రేషన్ కు సూచించారు. అక్రమ వలసదారులును తిరిగి స్వీకరించడంలో ఆయా దేశాలు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఈ చర్యకు పక్రమించాయి.హంతకులు సహా, ప్రమాదకరమైన నేరస్తులను ప్రతీరోజు రిలీజ్ చేస్తున్నామని, ఆయా దేశాలు వారిని వెనక్కి రప్పించడంలో తమకు సహకరించడం లేదని రిపబ్లికన్ సెనేటర్ చుక్ గ్రాస్లీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన హోం ల్యాండ్ సెక్యూరిటీ కౌన్సిల్ కి లేఖ రాశారు. ఇలాంటి వారిని ప్రతి రోజు విడుదల చేస్తున్నామని రిపబ్లికన్ సెనేటర్, సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్ చుక్ గ్లాసరీ హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి జె జాన్సన్ కు రాసిన ఒక లేఖ లో కోరారు.అంతకుముందు రెండేళ్లలో 6,100 మంది విడుదలైతే ఒక్క 2015 లోనే 2,166 మందిని ఇలా విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం, 23 దేశాలు అమెరికాతో సహకరించడం లేదని గ్రాస్లీ తన లేఖలో పేర్కొన్నారు. మొత్తం 62 దేశాలను అవియుధేలుగా గుర్తించినప్పటికీ,23 దేశాలను పెడసరి దేశాల ఖాతాలో చేర్చింది. ముఖ్యంగా క్యూబా, చైనా, సోమాలియా, ఇండియా, గయానాలను మరింత మొండిదేశాలుగా తేల్చి పారేసింది. వీటిని టాప్ ఫైవ్ లిస్ట్ లో చేర్చింది. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం 243(డీ) ప్రకారం ఈ చర్యలు తీసుకోవాలని గ్రాసీ కోరారు. 2001సం.రంలో ఒక్క గయానా విషయంలోనే ఈ సెక్షన్ ఒకసారి మాత్రం వాడామని చెప్పారు. తక్షణమే దీన్ని అమలు చేయడంతో గయనా దిగి వచ్చి సహకారం అందించిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







