తెలుగు రచయితల సంఘం ఆరో మహా సభలు..
- December 28, 2024
అమరావతి: విజయవాడలో తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను రెండ్రోజులపాటు నిర్వహించనున్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాలలో శని, ఆదివారాల్లో ఈ మహాసభలు నిర్వహించనున్నారు. సభాప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములుగా ప్రాంగణంగా నామకరణం చేశారు. దుబాయి, అమెరికా, లండన్, యూఏఈ దేశాల నుంచి మొత్తం 15 వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరుకానున్నారు. విశిష్ట అతిథిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. ఆరో ప్రపంచ తెలుగు కవుల మహాసభలను పురస్కరించుకుని రూపొందించిన మార్పు పరిశోధనా గ్రంథాన్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ ఆవిష్కరిస్తారు. ఈసారి మహాసభల్లో కవి సమ్మేళనంతోపాటు యువగళ సమ్మేళనం నిర్వహించనున్నారు. 300 మంది విద్యార్థులు హాజరు కానుండగా వారికి ఇక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







