థాయ్‌లాండ్‌కు వెళ్లే వారికి అలెర్ట్.. జనవరి 1నుండి ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి..!!
- December 28, 2024
దుబాయ్: థాయిలాండ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే యూఏఈ నివాసితులు తప్పనిసరిగా కొత్త ఇ-వీసా ప్లాట్‌ఫారమ్ ద్వారా జనవరి 1నుండి దరఖాస్తు చేసుకోవాలి. ఎంబసీ జారీ చేసిన నోటీసు ప్రకారం.. దరఖాస్తుదారులు ఇకపై అబుదాబిలోని రాయల్ థాయ్ ఎంబసీ లేదా దుబాయ్‌లోని రాయల్ థాయ్ కాన్సులేట్-జనరల్ వద్ద వ్యక్తిగతంగా పాస్‌పోర్ట్‌లు, అసలు సహాయక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ముందుగా, దరఖాస్తుదారు తప్పనిసరిగా థాయిలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్లో ఖాతాను నమోదు చేయాలి. ఇ-వీసా దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, దరఖాస్తుదారునికి నిర్ధారణ ఇమెయిల్ అందుతుంది. థాయ్‌లాండ్‌లోని డిపార్చర్, ఎయిర్‌లైన్ అధికారులకు అలాగే ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించడానికి దరఖాస్తుదారు ఈ ఇమెయిల్ కాపీని తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







