అజ్మాన్‌లో ‘ఫోన్ స్కామ్’..15 మంది ముఠా అరెస్ట్..!!

- December 29, 2024 , by Maagulf
అజ్మాన్‌లో ‘ఫోన్ స్కామ్’..15 మంది ముఠా అరెస్ట్..!!

యూఏఈ: అజ్మాన్‌లో "ఫోన్ స్కామ్" కేసులో 15 మంది వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఆసియా జాతీయుల ముఠా ఇతరులను ట్రాప్ చేస్తుందని, తద్వారా వారి బ్యాంకు వివరాలు లేదా వారి ID వంటి అధికారిక పత్రాలను అప్‌డేట్ చేయమని కోరుతూ, అధికారుల వలే నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. 

నకిలీ డేటా, డాక్యుమెంట్లతో నమోదైన ఫోన్ కార్డుల నుంచి వచ్చిన కాల్స్‌పై ఫిర్యాదులు అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు అనంతరం మోసానికి పాల్పడుతున్న ముఠాను గుర్తించి, వారి వద్ద నుండి 19 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని అజ్మాన్ పోలీస్‌లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ నుయిమి తెలిపారు.  ఇలాంటి కాల్‌లను నమ్మవద్దని, వాటిని నివేదించడానికి వెనుకాడవద్దని అల్ నుయిమీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్ చేయమని బ్యాంకులు అడగవని తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు ఈ ఫేక్ కాల్స్ , మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని,  సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల ద్వారా మాత్రమే డేటాను అప్‌డేట్ చేయాలని ఆయన సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com