ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రాజెక్టుపై చర్చించిన కువైట్ కేబినెట్..!!
- January 02, 2025
కువైట్: బయాన్ ప్యాలెస్‌లో ప్రధాన మంత్రి అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రణాళికా దశలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రాజెక్ట్ స్థితిపై చర్చించారు. పునరుద్ధరణ పనుల కోసం ఎంటర్టైన్మెంట్ సిటీని 2016లో మూసివేశారు. ప్రాజెక్ట్ స్థలాన్ని 2.65 మిలియన్ చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. జూలై 2024లో, మునిసిపల్ కౌన్సిల్ ప్రాజెక్ట్ పర్యవేక్షణను కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి బదిలీ చేశారు.
అంతకుముందు, ఒక అధ్యయనం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు KD 200 మిలియన్లుగా అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి GDPకి KD 85 మిలియన్లను అందించాలని, 2030 నాటికి 900,000 మంది సందర్శకులతో 4,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. కువైట్ విస్తృత అభివృద్ధి, పెట్టుబడులు,పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని క్యాబినెట్ కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీని కోరింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







