మూతపడ్డ ప్రసిద్ధ జైస్ అడ్వెంచర్ పార్క్..!!
- January 03, 2025
యూఏఈ: రస్ అల్ ఖైమాలో ప్రసిద్ధ జైస్ అడ్వెంచర్ తాత్కాలికంగా మూతపడ్డది. ప్రస్తుతం పునఃప్రారంభ తేదీని నిర్ణయించలేదని జైస్ అడ్వెంచర్ పార్క్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. పార్కులోని పొడవైన టోబోగాన్ రైడ్ వారం నుండి పనిచేయడం లేదు. అయితే, మూసివేతకు ఖచ్చితమైన కారణాన్ని చెప్పకపోయినా.. నిర్వహణ పనుల కోసమే పార్కును మూసివేసినట్లు తెలుస్తోంది. యూఏఈలోని ఎత్తైన పర్వతమైన రస్ అల్ ఖైమా జెబెల్ జైస్ యొక్క అడ్వెంచర్ కాంప్లెక్స్‌లో జైస్ స్లెడర్ ఎనిమిది సవారీలు ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అదే పరిసరాల్లో థ్రిల్ కోరుకునేవారు హైకింగ్‌కు వెళ్లవచ్చు లేదా ప్రపంచంలోనే అతి పొడవైన జిప్లైన్ని ప్రయత్నించవచ్చు. 2022లో ప్రారంభించినప్పటి నుండి జైస్ స్లెడర్ ప్రసిద్ధ రైడ్ గా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







