నేడు సింగపూర్ వెళ్లనున్న కేటీఆర్
- June 28, 2016
మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం సింగపూర్ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ జరిగే సౌతిండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మలేసియాకు చేరుకుని గురువారం, జూలై ఒకటిన అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరిగే మలేసియా పర్యటనలో అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అవుతారు. తిరిగి జూలై రెండో తేదీన మంత్రి హైదరాబాద్‌కు తిరిగివస్తారు. కేటీఆర్ వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ కూడా పర్యటనకు వెళుతున్నారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







