‘హరిహరవీరమల్లు’ నుంచి బిగ్ అప్డేట్
- January 04, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ‘హరిహరవీరమల్లు‘ మూవీ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నెల 6న ఉదయం 9.06 గంటలకు ‘మాట వినాలి’ అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ ప్రత్యేకత ఏమిటంటే, పవన్ కళ్యాణ్ స్వయంగా దీనిని ఆలపించడం. ఈ విషయమై మేకర్స్ విడుదల చేసిన ప్రకటనలో, పాటకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేశారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పాటలు కీరవాణి స్వరపరిచారు. పవన్ గాత్రం తోడవ్వడం ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకురాబోతుందని భావిస్తున్నారు.
‘హరిహరవీరమల్లు’ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి పాన్-ఇండియా సినిమా కావడం విశేషం. మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా విడుదల కానున్న ఈ చిత్రం అందరిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా కథ, సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా అత్యుత్తమంగా ఉండేలా టీమ్ కృషి చేస్తోంది. పిరియాడిక్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఫస్ట్ సింగిల్ విడుదల తర్వాత చిత్రబృందం ప్రోమోషనల్ యాక్టివిటీస్‌ను మరింత పెంచనుంది.ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్‌లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్‌లో హిందూ మహాసముద్ర సదస్సు..!!