ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ 2025..ఎంపికైన 27 మంది ఎన్నారైలు..!!

- January 05, 2025 , by Maagulf
ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ 2025..ఎంపికైన 27 మంది ఎన్నారైలు..!!

న్యూఢిల్లీ: గ్లోబల్ ల్యాండ్‌స్కేప్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు (PBSA) 2025కి ఎంపికైన 27 మంది అవార్డు గ్రహీతల పేర్లను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. ప్రవాస భారతీయుల విజయాలను పురస్కరించుకుని ప్రవాసీ భారతీయ దివస్ (PBD) జనవరి 8-10 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరగాల్సి ఉంది. భారత రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేస్తారు.

ఈ సంవత్సరం అవార్డు గ్రహీతలలో అజయ్ రాణే (ఆస్ట్రేలియా, సమాజ సేవ),  మరియాలెనా జోన్ ఫెర్నాండెజ్ (ఆస్ట్రియా, విద్య), ఫిలోమినా ఆన్ మోహిని హారిస్ (బార్బడోస్, మెడికల్ సైన్స్), స్వామి సంయుక్తానంద్ (ఫిజీ, కమ్యూనిటీ సర్వీస్), సరస్వతి విద్యా నికేతన్ (గయానా, కమ్యూనిటీ సర్వీస్), లేఖ్ రాజ్ జునేజా (జపాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ), ప్రేమ్ కుమార్ (కిర్గిజ్ రిపబ్లిక్, మెడికల్ సైన్స్), సౌక్తవి చౌదరి (లావోస్, బిజినెస్), కృష్ణ సావ్జాని (మలావి, బిజినెస్), 'టాన్ శ్రీ' సుబ్రమణ్యం కె.వి. సదాశివం (మలేషియా, రాజకీయాలు), సరితా బూధూ (మారిషస్, సమాజ సేవ), అభయ కుమార్ (మోల్డోవా, వ్యాపారం), రామ్ నివాస్ (మయన్మార్, విద్య), జగ్గనాథ్ శేఖర్ అస్థానా (రొమేనియా, వ్యాపారం), హిందుస్తానీ సమాజ్ (రష్యా, సమాజ సేవ), సుధా రాణి గుప్తా (రష్యా, విద్య), సయ్యద్ అన్వర్ ఖుర్షీద్ (సౌదీ అరేబియా, వైద్య శాస్త్రం), అతుల్ అరవింద్ తెముర్నికర్ (సింగపూర్, విద్య), రాబర్ట్ మసిహ్ నహర్ (స్పెయిన్, సమాజ సేవ), కౌశిక్ లక్ష్మీదాస్ రామయ్య (టాంజానియా, వైద్యం), క్రిస్టీన్ కార్లా కంగాలూ (ట్రినిడాడ్ మరియు టొబాగో, ప్రజా వ్యవహారాలు), రామకృష్ణన్ శివస్వామి అయ్యర్ (యూఏఈ, వ్యాపారం), బొంతల సుబ్బయ్య సెట్టి రమేష్ బాబు (ఉగాండా, సమాజ సేవ), ఉషా కుమారి ప్రషార్ (యుకె, రాజకీయాలు), శరద్ లఖన్‌పాల్ (యుఎస్‌ఎ, వైద్యం), షర్మిలా ఫోర్డ్ (USA, కమ్యూనిటీ సర్వీస్) మరియు రవి కుమార్ S (యుఎస్ఎ, బిజినెస్, IT అండ్ కన్సల్టింగ్) ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com